రుషికొండలో బ్లూ ఫ్లాగ్‌ రెపరెపలు

14 May, 2023 04:59 IST|Sakshi

భారత దేశంలో 12 బీచ్‌లకు అరుదైన గుర్తింపు

ఏపీ నుంచి ఒకే బీచ్‌గా రుషికొండ ఎంపిక 

పర్యావరణ అనుకూల సాగరతీరంగా రుషికొండ తీరం 

మూడుసార్లు బ్లూ ఫ్లాగ్‌ రెన్యువల్‌ చేసిన డెన్మార్క్‌ సంస్థ 

 33 అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బ్లూ ఫ్లాగ్‌ కేటాయింపు 

స్వచ్ఛమైన బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్‌ అందిస్తున్న పర్యావరణ అధ్యయన సంస్థ 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అందాల తీరానికి అంతర్జాతీయ హంగులద్దుతున్నారు. స్వచ్ఛత, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి పర్యావరణ హితంగా.. పర్యాటక స్వర్గధామంగా ఉన్న బీచ్‌లకు విదేశీ గుర్తింపు లభిస్తోంది. డెన్మార్క్‌కు చెందిన అధ్యయన సంస్థ అందించే ఈ ధ్రువపత్రం వస్తే చాలు.. ఆ బీచ్‌లకు విదేశీయులు క్యూ కడతారు. అంతర్జాతీయ సాగరతీరంగా గుర్తింపు పొందుతూ.. సురక్షితమైన బీచ్‌ల జాబితాలో భారత్‌కు చెందిన 12 ప్రాంతాల్లో బ్లూ ఫ్లాగ్‌ రెపరెపలాడుతున్నాయి. వరుసగా మూడో ఏడాది రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్‌ గుర్తింపు వచ్చింది.  

ఈ బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు ఎలా వస్తుందంటే.. 
బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లు అంటే కాలుష్యం దరిచేరని పూర్తిగా పర్యావరణ అనుకూల సాగర తీరాలు. బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు ఉన్న బీచ్‌లకు విశేష ఆదరణతోపాటు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సర్టీఫికెట్‌ దక్కాలంటే బీచ్‌ పరిసరాలు పరిశుభ్రంగా, నీరు కలుషితం కాకుండా, రసాయనాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక దేశాన్ని సందర్శించేందుకు వెళ్లే విదేశీ పర్యాటకులు ఆ దేశంలో బీచ్‌ల గురించి శోధించినప్పుడు ముందుగా బ్లూ ఫ్లాగ్‌ గురించే సెర్చ్‌ చేస్తారు. బ్లూ ఫ్లాగ్‌ ఉన్న బీచ్‌లు ఉంటే.. ఆ ప్రాంతాన్ని కచ్చితంగా విదేశీ పర్యాటకులు పర్యటిస్తారు.

బ్లూ ఫ్లాగ్‌ ధ్రువ పత్రం పొందాలంటే నాలుగు విభాగాల్లోని 33 అంశాల్లో బీచ్‌ని అభివృద్ధి చేయాలి. మలినాలు, వ్యర్థాలు, జల కాలుష్యం ఉండకూడదు. పర్యావరణ హితంగా ఉండాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. పరిశ్రమల వ్యర్థాలు కలవకూడదు. సముద్రంలో స్నానం చేసేటపుడు ఆరోగ్యపరమైన భద్రత ఉండాలి. నీటిలో బ్యాక్టీరియా ఉండకూడదు. 150 మీటర్ల వరకు తీరం నుంచి లోపలకు ఇసుక తిన్నెలుండాలి.

సముద్రంలో బోటింగ్‌ సదుపాయం ఉండాలి. ఈ  ప్రాజెక్టుకు ఎంపికైన బీచ్‌లలో ఆయా అంశాల్లో పనులు పూర్తయిన అనంతరం ఎఫ్‌ఈఈ ప్రతినిధులు ఎక్కడైనా ఒకచోట ఒక చదరపు అడుగులో ఇసుకని తవ్వి నాణ్యత పరిశీలిస్తారు. నీటి నాణ్యతని కూడా పరిశీలించి సంతృప్తి చెందితే సర్టీఫికెట్‌ ఇస్తారు. బీచ్‌లో బ్లూ ఫ్లాగ్‌ (నీలం రంగు జెండా) ఎగురవేస్తారు.

బ్లూ ఫ్లాగ్‌ ఎవరు ఇస్తారు? 
1985లో డెన్మార్క్‌లో ప్రారంభించిన ’ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్మెంటల్‌ ఎడ్యుకేషన్‌’(ఎఫ్‌ఈఈ) ఏజెన్సీ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్‌ సర్టీఫికెట్లను అందిస్తోంది. ప్రపంచంలో తొలిసారి ఈ సర్టీఫికెట్‌ పొందిన దేశం స్పెయిన్‌. బ్లూ ఫ్లాగ్‌ సర్టీఫికెట్‌ అందిస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ స్పెయిన్‌ దేశానికి చెందిన సాగరతీరాలు ఎక్కువ సంఖ్యలో బ్లూ ఫ్లాగ్‌ సర్టీఫికెట్స్‌ను సొంతం చేసుకున్నాయి. స్పెయిన్‌లో ఇప్పటి వరకు మొత్తం 566 బీచ్‌లు ఈ సర్టీఫికెట్‌ పొందగా, గ్రీస్‌ 515, ఫ్రా

న్స్‌ 395 బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్స్‌ పొందాయి. మొత్తం 50 దే­శాల్లో 4,831 బీచ్‌లకు ఈ సర్టీఫికెట్‌ లభించింది.

బ్లూ ఫ్లాగ్‌ ఆవిష్కరణ
కొమ్మాది(భీమిలి):  రానున్న కాలంలో మరిన్ని బీ­చ్‌­ ­లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చే­సేందుకు కృషి చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ అన్నారు. రుషికొండ బీచ్‌లో శ­నివారం బ్లూ ఫ్లాగ్‌ను జేసీ కె.ఎస్‌.విశ్వనాథన్, బ్లూ ఫ్లాగ్‌ ఇండియా ఆపరేటర్‌ డాక్టర్‌ కురూప్‌ల­తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టూ­రిజం రీజనల్‌ డైరెక్టర్‌ శ్రీని­వాస్, స­మా­చార­శాఖ జేడీ వి.మణిరామ్‌ పాల్గొ­న్నారు.

మన దేశంలో 2018లో తొలిసారిగా..  
భారతదేశంలోనే కాదు.. ఆసియా ఖండంలో ఈ సర్టీఫికెట్‌ పొందిన తొలి బీచ్‌ ఒడిశాలోని కోణార్క్‌ తీరంలోని ’చంద్రబాగ్‌’ బీచ్‌. ఇది 2018లో ఈ సర్టిఫికెట్‌ పొందింది. ఆ తర్వాత ఇండియాలో మరో 12 తీర ప్రాంతాలను బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ పొందే స్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పనిని పర్యావరణశాఖ ఆధ్వర్యంలో పని చేసే సొసైటీ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ కోస్టల్‌ మేనేజ్‌ మెంట్‌కు అప్పగించింది. తొలి సారిగా భారత్‌కు చెందిన 13 బీచ్‌లు ఇందుకు అర్హత సాధించగా.. ఇప్పటి వరకూ 12 బీచ్‌లలో బ్లూ ఫ్లాగ్‌ ఎగురుతోంది.

ఇవీ బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లు..  
మొత్తంగా 12 బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లు ఉండగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క తీరంలో నీలి జెండా రెపరెపలాడుతోంది. 2020 అక్టోబర్‌ 10న రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ దక్కింది. అప్పటి నుంచి వరుసగా మూడేళ్లు ఎఫ్‌ఈఈ రుషికొండకు బ్లూ ఫ్లాగ్‌ను రెన్యువల్‌ చేస్తోంది.

ఇంకా మనదేశంలో చంద్రబాగ్, రుషికొండతో పాటు బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. పుదుచ్ఛేరిలోని ఈడెన్‌ బీచ్, గుజరాత్‌లోని శివరాజ్‌ పూర్, డయ్యూలోని ఘోఘ్లా, కర్ణాటకలోని కసర్‌కోడ్, పడుబిద్రి బీచ్‌లు, కేరళలోని కప్పడ్, ఒడిశా నుంచి పూరి గోల్డెన్‌ బీచ్, అండమాన్‌ నికోబార్‌ దీవుల నుంచి రాధానగర్‌ బీచ్, లక్షద్వీప్‌ నుంచి మినికోయ్‌ తుండి, కద్మత్‌ బీ­చ్‌­లు బ్లూ ఫ్లాగ్‌ సర్టీఫికేషన్‌ దక్కించుకున్నాయి.

మరిన్ని వార్తలు