తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాల సందర్శన

3 Feb, 2023 05:19 IST|Sakshi
క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న అధికారులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి చెప్పారు. తొలి దశలో భాగంగా విజయవాడ కేంద్రంగా మూడు ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్లను రూపొందించినట్లు తెలిపారు. రెండో దశలో విశాఖ నుంచి మరో మూడు సర్క్యూట్లను ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ప్రయాస లేకుండా.. తక్కువ ఖర్చులో పుణ్యక్షేత్రాల సందర్శనను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. గైడ్‌తో పాటు రవాణా, భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ఒక్కో సర్క్యూట్‌లో 7 నుంచి 10 దేవాలయాలను సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఏపీటీడీసీ ఎండీ కన్నబాబు మాట్లాడుతూ.. ప్రతి భక్తుడు సంతృప్తికరంగా, సురక్షితంగా ఆలయాలను సందర్శించేలా ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు ఏపీటీడీసీ చైర్మన్, ఎండీ కలిసి పర్యాటక శాఖ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఏపీటీడీసీ ఈడీ (ఆపరేషన్స్‌) గోవిందరావు, ఈడీ (ప్రాజెక్ట్స్‌) మల్‌రెడ్డి, రిలీజియస్‌ టూరిజం స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్, ట్రాన్స్‌పోర్టు మేనేజర్‌ జగదీశ్‌ పాల్గొన్నారు. 

తొలి దశలోని ఆధ్యాత్మిక సర్క్యూట్లు.. 
విజయవాడ–తిరుపతి: విజయవాడ ఇంద్రకీలాద్రి, మంగళగిరి పానకాల నరసింహస్వామి, నెల్లూరు రంగనాథస్వామి, శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వరస్వామి, తిరుమల వేంకటేశ్వరస్వామి, తిరుచానూరు, కాణిపాకం. 

విజయవాడ–శ్రీశైలం: ఇంద్రకీలాద్రి, మంగళగిరి, పెదకాకాని మల్లేశ్వరస్వామి, త్రిపురాంతకం, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి. 

విజయవాడ–సింహాచలం: ఇంద్రకీలాద్రి, ద్వారకా తిరుమల, అన్నవరం, లోవ తలుపులమ్మ, పిఠాపు­రం శక్తి, దత్తాత్రేయపీఠం, వాడపల్లి వేంకటేశ్వ­రస్వామి, ర్యాలి లక్ష్మీజగన్మోహినీ కేశవస్వామి, సింహాచలం. 

రెండో దశకు సంబంధించిన ప్రతిపాదనలు.. 
విశాఖ–శ్రీకాకుళం: సింహాచలం, విశాఖలోని కనకమహాలక్ష్మి దేవాలయం, అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రామతీర్థం. 

విశాఖ–తిరుపతి: సింహాచలం, విశాఖలోని కనకమహాలక్ష్మి దేవాలయం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, మంగళగిరి, నెల్లూరు రంగనాథస్వామి, శ్రీకాళహస్తి, తిరుమల, తిరుచానూరు, కాణిపాకం. 

విశాఖ–శ్రీశైలం: సింహాచలం, విశాఖలోని కనకమహాలక్ష్మి దేవాలయం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, మంగళగిరి, పెదకాకాని మల్లేశ్వరస్వామి, త్రిపురాంతకం, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి. 

మరిన్ని వార్తలు