ఏపీ శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం

18 Jun, 2021 19:28 IST|Sakshi

సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన గవర్నర్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం నియామకం ఖరారైంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఆమోదం తెలిపారు.

కాగా, గవర్నర్‌ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు కూడా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపిన సంగతి విదితమే. దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్‌కుమార్‌ (వైఎస్సార్‌ కడప), మోషేన్‌రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌ నియామకానికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు.

చదవండి: ‘లోకేష్‌ బఫూన్‌కు తక్కువ.. జోకర్‌కు ఎక్కువ’
ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌

మరిన్ని వార్తలు