అద్భుతం: గుండుసూదిపై ఫ్లెమింగో

3 Mar, 2021 20:44 IST|Sakshi

ఏటికొప్పాక హస్తకళాకారుడి ప్రతిభ

సాక్షి, యలమంచిలి రూరల్ (విశాఖపట్నం)‌: ఏటికొప్పాక హస్తకళాకారుడు మరో అద్భుత కళాఖండం ఆవిష్కరించారు. ఏటికొప్పాక గ్రామానికి చెందిన ఎస్‌.చిన్నయాచారి గుండుసూదిపై ఫ్లెమింగో పక్షి బొమ్మను రూపొందించారు. దీన్ని తయారు చేసేందుకు రాగి తీగలు, చెక్క ఉపయోగించి మూడు రోజులపాటు శ్రమించినట్లు ఆయన వివరించారు. పొడవు 4.80, వెడల్పు 1.75 ఎంఎం సైజులో తయారు చేసిన పక్షి రూపాన్ని పుటాకార దర్పణంతో వీక్షించేలా తయారు చేశారు. వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా దీన్ని రూపొందించినట్లు ఆయన వివరించారు. ఏటికొప్పాక కళాకారులు చిన్నయాచారిని అభినందించారు.

చదవండి: బట్టతల బెంగా.. పరిష్కారాలు ఇవిగో..!

మరిన్ని వార్తలు