బీచ్‌లో అలల సవ్వడిని ఆస్వాదిస్తూ వేడి వేడి బిర్యానీ.. బస్సుపై కూర్చుని తింటే...!

3 May, 2022 18:17 IST|Sakshi
సాగరతీరంలో ఏర్పాటు చేసిన ఓసియన్‌ ఎడ్జి రెస్టారెంట్‌, రూప్‌టాప్‌పై ప్రముఖ యాంకర్‌ సుమ  

సాగరతీరంలో రూఫ్‌టాప్‌ డైనింగ్‌ 

విశాఖ యువకుడి సరికొత్త ఆలోచన 

బీచ్‌రోడ్డు (విశాఖతూర్పు): సాగరతీరం.. ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది.. రోజూ చూస్తున్నా ఏదో తెలియని అనుభూతి.. అలల సవ్వడి పలకరిస్తాయి. చిరుగాలులు మనసును ఆహ్లాదపరుస్తాయి. అందుకే విశాఖ బీచ్‌ ఎనలేని ఖ్యాతి సొంతం చేసుకుంది. అటువంటి సాగరతీరంలో అలల సవ్వడి వింటూ.. ఎగసి పడే కెరటాలను చూస్తూ..చల్లగాలి ఆహ్లాదాన్ని మజా చేస్తూ మరో వైపు లైవ్‌ మ్యూజిక్‌ హమ్‌ చేస్తూ వేడి వేడి బిర్యానీ తింటే.. నూరూరించే పిజ్జా ఆరగిస్తే.. జింహ్వచాపల్యానికి ఇంతకంటే ఇంకేం కావాలి.

ఇప్పుడు అటువంటి రెస్టారెంట్‌ నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చాడు ఓ యువకడు. నగరవాసుల టేస్ట్‌ను పట్టుకున్న వెంకట నాగచంద్ర (చందు).. కొత్త ఆలోచనలకు ఎప్పుడూ సిటి జనలు ఆదరస్తారన్న నమ్మకంతో ఓసియన్‌ ఎడ్జ్‌ పేరుతో  మొబైల్‌ రూఫ్‌టాప్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దాడు. బస్సు టాప్‌పై కూర్చుని సముద్ర అందాలను వీక్షిస్తూ ఇష్టమైన ఆహారాన్ని తీంటుంటే వావ్‌ అనాల్సిందే.. ఒక్క సారైనా చూడడానికైనా వెళ్లాల్సిందే. 
చదవండి👉🏾 తిరుపతి, అరకుకు స్పెషల్‌ టూర్స్‌

సరికొత్త అనుభూతి.. 
రూఫ్‌టాప్‌పై కూర్చుని సముద్రం అలల చూస్తూ 
తింటుంటే ఏదో తెలియని సరికొత్త అనుభూతి పొందుతున్నట్టు ఉంది. పాత కాలం గోలిసోడ తాగుతూ ఫిష్‌ ఫ్రై తింటుంటే చాలా అద్భుతంగా ఉంది.  
–దుర్గాప్రసాద్, ఆహార ప్రియుడు 

వైజాగ్‌లో మొదటిసారిగా.. 
యూరప్‌ దేశాలకే పరిమితమైన ఈ రెస్టారెంట్‌ విశాఖ నగరంలో మొదటి మొబైల్‌ రూఫ్‌టాప్‌ రెస్టారెంట్‌ను ఏర్పటు చేశాడు. ఈ రెస్టారెంట్‌ ఇప్పటికే అనేక పార్టీలకు వేదికైంది. ఈ రెస్టారెంట్‌ను సాగతీరంలోనే కాకుండా ఆహార ప్రియుల ఆసక్తి మేరకు వారి చెప్పిన ప్రాంతంలో కూడా ఏర్పాటు చేస్తారు. బస్సుపైన డైనింగ్‌ చేస్తూ నగర వాసులు ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నారు. మరిన్ని ఇటువంటి రెస్టారెంట్‌లు నగరంలో ఏర్పాట చేయాలని చందు భావిస్తున్నాడు.
చదవండి👉🏻 ముడతలు, బ్లాక్‌ హెడ్స్‌కు చెక్‌.. ఈ డివైజ్‌ ధర రూ. 2,830

గోలి సోడ నుంచి పిజ్జా వరకు 
మొబైల్‌ రూఫ్‌టాప్‌ రెస్టారెంట్‌లో అన్ని రకాల ఆహారం పదార్థాలు లభిస్తున్నాయి. పాతతరం గోలి సోడ నుంచి కొత్త తరం పిజ్జా, బిర్యానీ, బర్గర్లు వరకు అనేక వంటకాలు అందుబాటులో ఉన్నాయి.  

లైవ్‌ మ్యూజిక్‌

యూరప్‌లో చూసి..
నగరంలో తన మార్కు చూపించాలని చందుకు ఎప్పుడూ ఉండేది. వినూత్నమైన ఆలోచనలతో ముందుకు సాగేవాడు. అలాంటి సమయంలో ఫ్యామిలీతో యూరప్‌ వెళ్లినప్పుడు ఎక్కువగా ఇంటువంటి మొబైల్‌ రూఫ్‌టాప్‌ డైనింగ్‌ రెస్టారెంట్లను చూశాడు. అబ్బా భలే ఉందే...మన విశాఖలో ఇలా పెడితే బ్రహ్మాండంగా ఉంటుందని నిర్ణయించుకున్నాడు.

అంతేకాకుండా విశాఖ పర్యాటకపరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. మొబైల్‌ రూఫ్‌టాప్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ కచ్చితంగా క్లిక్‌ అవుతుందని భావించాడు. ఆలోచన రావడమే తరువు అన్నట్టు అన్ని ఎర్పాట్లు చేసుకుని జీవీఎంసీ అనుమతులను పొంది ఆరు నెలల క్రితం వైఎంసీఏ వద్ద ఈ ఓసియన్‌ ఎడ్జ్‌ మొబైల్‌ రూఫ్‌టాప్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. నగర యువత ఇప్పుడు ఈ రెస్టారెంట్‌ కొత అనుభూతిని పొందుతున్నారు. ఈ రెస్టారెంట్‌ ద్వారా 12 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు చందు.  
చదవండి👉 అధరహో...సిరులు కురుపిస్తున్న చింత

ఆహార ప్రియులతో కిటకిటాలడుతున్న రూప్‌టాప్‌ డైనింగ్‌ 

ప్రభుత్వం సహకరిస్తే ఫ్లైట్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు 
ఎప్పుడు వినూత్నంగా ఏదైన చేయాలనేది నా ఆలోచన. అందులో భాగంగానే ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశా. నగర వాసులు ఆదరణ చాలా బాగుంది. ఆహార ప్రియుల కోరిక, ఆసక్తి మేరకు ప్రజల వద్దకే మా రెస్టారెంట్‌ను తీసుకొని వెళ్లడం జరుగుంది. ప్రస్తుతం ఫ్లైట్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయాలనేది నా లక్ష్యం దీనికి ప్రభుత్వం సహకరించాలి. ఇప్పటికే ఫ్లైట్‌ రెస్టారెంట్‌ ఏర్పాటుకు కావాల్సిన అన్ని సిద్ధం చేసుకున్నా. కానీ దాన్ని సరైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. అందుకు ప్రభుత్వం స్థలం కేటాయిస్తే రెస్టారెంట్‌ ఏర్పాటు చేసి పర్యటకులను ఆకర్షించవచ్చు.  
–నాగచంద్ర (చందు), ఓసియన్‌ ఎడ్జి రెస్టారెంట్‌ 

మరిన్ని వార్తలు