వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అక్కడే: సీపీ శ్రీకాంత్‌

7 Jan, 2023 18:56 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆంధ్ర యూనివర్శిటీ గ్రౌండ్‌లో అనుమతి ఇచ్చినట్లు విశాఖపట్నం సీపీ శ్రీకాంత్‌ తెలిపారు. నిర్వాహకులు అక్కడే ప్రీ రిలీజ్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. వారి విజ్ఞప్తి మేరకు ఏయూ ఇంజినీరింగ్‌ గ్రౌండ్‌లో ఈవెంట్‌ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగిందని సీపీ శ్రీకాంత్‌ అన్నారు.

దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్‌ నటించగా.. రవితేజ ముఖ్య పాత్ర పోషించాడు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

చదవండి: (వాల్తేరు వీరయ్య ట్రైలర్‌.. బాస్‌ నోట మాస్‌ డైలాగ్స్‌, చిరుకు రవితేజ వార్నింగ్‌)

మరిన్ని వార్తలు