కాబోయే అమ్మకు ఎంత కష్టమో.. !

10 Nov, 2021 13:54 IST|Sakshi

నిండు గర్భిణిని డోలీలో 20 కిలోమీటర్లు... 

శృంగవరపుకోట రూరల్‌: ఎస్‌.కోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామం కురిడికి చెందిన ఎం.పెంటమ్మ అనే గర్భిణికి మంగళవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. స్థానిక మహిళలు సుఖప్రసవానికి ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో డోలీలో 20 కిలోమీటర్లు మోసుకొచ్చి దబ్బగుంటకు చేర్చారు. అక్కడి నుంచి ఆటోలో ఎస్‌.కోట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి విజయనగరం ఘోషాస్పత్రికి రిఫర్‌ చేశారు. కురిడి గిరిశిఖర గ్రామం కావడం, సరైన దారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర వేళ కష్టాలు తప్పడంలేదని గిరిజనులు వాపోతున్నారు. గిరిశిఖర గిరిజన గ్రామాలకు త్వరితగతిన బీటీ రోడ్డు సౌక ర్యం కల్పించాలని గిరిజన పెద్దలు జె.గౌరీషు, ఆర్‌.శివ, సన్యాసిరావు, మాజీ సర్పంచ్‌ మాదల బుచ్చయ్య కోరారు.  

మరిన్ని వార్తలు