విషాదం: జడ్‌పీ వైస్‌ చైర్మన్‌ అంబటి అనిల్‌ మృతి

23 Oct, 2021 09:04 IST|Sakshi

అనిల్‌ మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం జగన్‌

సాక్షి, విజయనగరం : జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అంబటి అనిల్ గుండె పోటుతో మృతి చెందారు. జిల్లా పరిషత్‌లో అందరి కన్నా చిన్న వయస్సున్న జడ్‌పీటీసీగా గుర్తింపు పొందారు. అంబటి అనిల్.. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడు. అనిల్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. 

అనిల్ సొంతూరు సొంతూరు సాలూరు మండలం సన్యాసిరాజుపేట. జడ్‌పీ వైస్ చైర్మన్ మృతితో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనిల్‌ మృతిపై వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..!

మరిన్ని వార్తలు