విశాఖ: అక్రమ లీజుపై ప్రభుత్వం ఉక్కుపాదం

15 Nov, 2020 10:14 IST|Sakshi

లీజుదారుడిని ఖాళీ చేయిస్తున్న అధికారులు

సాక్షి, విశాఖ : నిబంధనలకు విరుద్ధంగా విశాఖలో వీఎంఆర్‌డీఏ స్థలంలో కొనసాగుతున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌ను అధికారులు ఖాళీ చేయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడేళ్ల వరకు మాత్రమే లీజు కొనసాగించాల్సి ఉన్నప్పటికీ దశాబ్దాల కాలంగా ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ వీఎంఆర్‌డీఏ స్థానంలో కొనసాగుతోంది. 2015 నుంచి 24 వరకు అనుమతులు ఇస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. వాస్తవానికి మూడేళ్లపాటు మాత్రమే అనుమతి ఇవ్వడమే కాక ఆ తర్వాత కొనసాగించాలంటే వేలంపాట వేయాల్సి ఉంది. 

కానీ ఈ నిబంధనలు పాటించకుండానే తొమ్మిదేళ్ల పాటు తాజాగా అనుమతులు పొంది ఫ్యూజన్ ఫుడ్స్ కొనసాగుతోందన్న ఫిర్యాదుపై వీఎంఆర్‌డీఏ అధికారులు చర్యలు తీసుకున్నారు. సామాగ్రిని యజమానికి అప్పగించి ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అతి సన్నిహితుడిగా పేరొందిన హర్ష కుమార్ ఈ ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ నిర్వాహకుడు కావడం విశేషం. సిరిపురం జంక్షన్ వద్ద ఉడా నుంచి లీజుకు తీసుకున్న ఆస్తిని టీడీపీ నేత హర్ష రెండింతల అద్దెకు మరొకరికి ఇచ్చాడు. దీంతో అక్రమ లీజుపై ఉక్కుపాదం మోపిన అధికారులు లీజుదారుడిని ఖాళీ చేయించారు.

మరిన్ని వార్తలు