శభాష్‌ వలంటీర్‌

4 Jul, 2022 08:45 IST|Sakshi

విశాఖపట్నం: గ్రామ వలంటీర్లు ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. విధి నిర్వహణలో సేవా దృక్పథంతో వ్యవహరిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఈక్రమంలోనే దేవరాపల్లి మండలం ఎన్‌. గజపతినగరం గ్రామానికి చెందిన వృద్ధురాలు పాసల రామయ్యమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నం గురుద్వార్‌లోని తన కుమార్తె దగ్గర ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక గ్రామ వలంటీర్‌  గండి స్వాతి తన సొంత ఖర్చులతో అక్కడకు చేరుకుని పింఛన్‌ సొమ్ము అందజేసింది. వలంటీర్‌ స్వాతిని గ్రామస్తులు అభినందించారు.  

విశాఖ కేజీహెచ్‌కు వెళ్లి... 
అదేవిధంగా చీడికాడ మండలం అర్జునగిరికి చెందిన జకిలింకి తాతయ్యలు అనారోగ్యంతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. వలంటీరు ఏ.సూర్యకాంతం అక్కడకు వెళ్లి నగదు అందించారు. చుక్కపల్లికి చెందిన కోటిబోయిన పైడితల్లమ్మ కంటి శస్త్ర చికిత్స చేసుకుని తూర్పుగోదావరి జిల్లా అత్తిలి మండలం పాలి గ్రామంలో బంధువుల ఇంటి వద్ద ఉంటోంది. గ్రామ వలంటీరు రాజు అక్కడకు వెళ్లి ఆమెకు పింఛన్‌ సొమ్ము అందించారు. సూర్యకాంతం, రాజులను ఆయా గ్రామాల సర్పంచ్‌లు బి.రమాదేవి, మజ్జి లక్ష్మణమ్మతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు కొవిలపల్లి పైడిబాబు, పరవాడ నాయుడు, మజ్జి దేవానంద్, బాయిశెట్టి వెంకటరమణ, వలంటీర్ల అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి అభినందించారు.   

మరిన్ని వార్తలు