జిల్లాలు దాటి ‘విద్యా దీవెన’ నమోదు

12 Jul, 2021 04:48 IST|Sakshi
నిడదవోలులో బయోమెట్రిక్‌ తీసుకుంటున్న వలంటీర్‌ గోపి

కూచిపూడి(అమృతలూరు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తున్నారు. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం కూచిపూడి గ్రామ వలంటీర్‌ దేవరకొండ గోపి తన పరిధిలోని ఉండ్రాకొండ విజయలక్ష్మి కుటుంబం కూలి పనులు నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు వెళ్లారు.

ఆమె కుమారుడికి విద్యా దీవెన పథకం కింద ఆన్‌లైన్లో దరఖాస్తు చేసేందుకు వలంటీర్‌ గోపి ఆదివారం నిడదవోలు వెళ్లాడు. ఆమె ఆ సమయంలో పొలంలో నాటు వేసేందుకు వెళ్లగా.. చిరునామా కనుక్కుని మరీ వెళ్లి బయోమెట్రిక్‌ చేశాడు. పొట్ట కూటి కోసం దూరప్రాంతానికి వెళ్లిన తమ కోసం వలంటీర్‌ జిల్లాలు దాటి వచ్చి విద్యా దీవెన నమోదు చేయడంపై ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు