సర్పంచ్‌ బరిలో ‘వలంటీర్లు’ 

1 Feb, 2021 04:41 IST|Sakshi
సర్పంచ్‌ అభ్యర్థులుగా కరక రాజ్యలక్ష్మి, పి.శ్రీనివాసులు  

సాక్షి, విశాఖ జిల్లా/చిత్తూరు జిల్లా: సంక్షేమ పథకాల అర్హుల ఎంపికలో, సేవలందించడంలో ఉత్తమంగా వ్యవహరిస్తోన్న వలంటీర్‌లను గ్రామస్తులు సర్పంచ్‌ అభ్యర్థులుగా బరిలో నిలిపారు. విశాఖ జిల్లా కశింకోట మండలం జమాదులపాలెంకు చెందిన కరక రాజ్యలక్ష్మి ఇంటర్‌ చదివి వలంటీర్‌గా ఎంపికైంది. గ్రామంలో పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఆమె ప్రత్యేక చొరవ చూపింది. దీన్ని గుర్తించిన గ్రామస్తులు రాజ్యలక్ష్మిని సర్పంచ్‌ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే, చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో పెద్దపల్లె పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా ఆ గ్రామ పరిధిలోని గౌడసానిపల్లె గ్రామ వలంటీర్‌ పి.శ్రీనివాసులు రెండో విడతలో నామినేషన్‌ వేయడానికి సన్నాహాల్లో ఉన్నారు. బీటెక్‌ చదివిన శ్రీనివాసులు ఏడాదిగా వలంటీర్‌గా పనిచేస్తున్నారు. వలంటీర్‌ ఉద్యోగానికి ఇటీవలే రాజీనామా చేశాడు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు