సీఎం జగన్‌కి క్షమాపణలు చెప్తున్నాం: వలంటీర్లు

10 Feb, 2021 16:09 IST|Sakshi

సీఎం జగన్‌ లేఖపై స్పందించిన వలంటీర్లు

సాక్షి, విజయవాడ: జీతాలు పెంచాలంటూ ఆందోళన చేస్తోన్న వలంటీర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్‌ లేఖపై వలంటీర్లు స్పందించారు. విజయవాడ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తుల ప్రలోభాల వలన కొందరు వలంటీర్లు అలా చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వలంటీర్లు మీడియాతో మాట్లాడారు. ‘‘ఆ రోజు మేము వినతిపత్రం ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాము. విజయవాడలో జరిగిన ఘటనలో మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. వలంటీర్లు అందరి తరుపున సీఎం జగన్‌కి  క్షమాపణలు చెబుతున్నాము’’ అన్నారు.

‘‘సీఎం జగన్‌ వలంటీర్లుకు రాసిన లేఖ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. దీని ద్వారా ఆయన మాకు క్లారీటీ ఇచ్చారు. గతంలో ప్రతి రోజు ఆఫీసుకి రావాలి.. లేకపోతే మీ జీతాలు కట్ అవుతాయి అని చెప్పేవారు. అయితే సీఎం రాసిన లేఖ ద్వారా మా విధివిధానాలు తెలుసుకున్నాం. వారానికి రెండు, మూడు రోజులు మాత్రమే సేవ చేయ్యండని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రజలకు సేవ చేయ్యలన్న దృక్పథంతో ఉన్న సీఎంని స్ఫూర్తిగా తీసుకుని సేవ చేస్తున్నాం. మేము ఎప్పటికి సీఎం జగన్‌కి వ్యతిరేకంగా కాదు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి.. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తాం’’ అని వలంటీర్లు స్పష్టం చేశారు.

చదవండి: వలంటీర్‌ అంటేనే స్వచ్ఛంద సేవ

మరిన్ని వార్తలు