కల్యాణం నేపథ్యంలో.. 15న ట్రాఫిక్‌ మళ్లింపు

13 Apr, 2022 13:51 IST|Sakshi

జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌  

కడప అర్బన్‌: ఒంటిమిట్టలో ఈనెల 15న సీతారాముల కల్యాణం జరగనున్న నేపథ్యంలో ప్రయాణికులకు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. భక్తుల వాహనాలు మినహా ఎలాంటి ఇతర వాహనాలను అనుమతించరని తెలిపారు. ఈ మేరకు ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వాహనాల మళ్లింపు వివరాలు ఇలా..   

► కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్‌పల్లి, ఇర్కాన్‌ సర్కిల్‌ నుంచి ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్లాలి.  
► పులివెందుల నుంచి కడప నగరానికి, కడప మీదుగా వెళ్లే వాహనాలను సాక్షి సర్కిల్‌ నుంచి ఊటుకూరు సర్కిల్‌ వైపు దారి మళ్లిస్తారు. 
► తిరుపతి నుంచి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుంచి రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి.  
► రాజంపేట వైపు నుంచి వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా మళ్లిస్తారు. 
► రాజంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు సాలాబాద్‌ నుంచి ఇబ్రహీంపేట, మాధవరం మీదుగా దారి మళ్లిస్తారు. 
► రాజంపేట వైపు నుంచి వచ్చే వాహనాలను సాలాబాద్‌ సమీపంలో 15 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశాల్లో క్రమపద్ధతిలో నిలపాలి.  
► కల్యాణ వేదిక నుంచి కడప మార్గంలో 10 చోట్ల పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.   

మరిన్ని వార్తలు