మున్సిపోల్స్‌పై ఖాకీల డేగకన్ను.. 

5 Mar, 2021 17:27 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఈనెల 10న జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికలపై విజయవాడ ​పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. సిటీ పోలీస్ కమీషనరేట్ పరిధిలో కీలకమైన విజయవాడ కార్పొరేషన్, ఉయ్యూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీపీ బత్తిన శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించారు. సీపీ నిత్య పర్యటనలతో సిబ్బందిని అలర్ట్‌ చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో మొత్తం 3,200 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు, ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నట్లు సీపీ తెలపారు. 

ఎన్నికల విధుల్లో 67 మొబైల్, 27 స్ట్రైకింగ్, 12 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నేర చరిత్ర కలిగిన 1900 మందిని 110 సీఆర్పీసి కింద బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. ఈనెల 8వ తేదీ నుండి పోలింగ్ కేంద్రాలను అధీనంలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తే ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు