మార్గదర్శి చిట్‌ స్కామ్‌: చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగాయి.. సమాచారాన్ని సీఐడీ అధికారులకు పంపుతున్నా!

14 Mar, 2023 14:04 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించి.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)తో దర్యాప్తు జరిపించాలని ఏపీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కోరుతున్నారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

చిట్స్‌కు సంబంధించి గతంలో రిజిస్టర్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఇచ్చిన సమాచారాన్ని సీఐడీ అధికారులకు పంపుతున్నా. ఏపీ చిట్‌ఫండ్‌ యాక్ట్‌ 14(2) ప్రకారం సేకరించిన.. నగదు మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేయాలి. కానీ, మార్గదర్శిలో అలా జరగలేదు అని ఉండవల్లి వెల్లడించారు. 

చట్ట విరుద్ధంగా డిపాజిట్‌దారుల సొమ్మును మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మార్గదర్శిలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని, 2008లోనే వట్టి వసంత్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. మార్గదర్శి ఫైనాన్స్‌ షేర్‌పై నేను కేసు పెట్టే సమయానికి.. రూ.1,360 కోట్ల నష్టాల్లో ఉందని ఉండవల్లి వెల్లడించారు. 

సంస్థ నుంచి కనీస సమాచారం కూడా అధికారులకు ఇవ్వడం లేదు. రామోజీ సెలబ్రిటీ కాబట్టి ఇప్పటిదాకా చర్యలు చేపట్టలేదు. మార్గదర్శి చిట్స్‌లో జరిగే అవకతవకలపై ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు