Union Budget 2023-24: వాల్తేర్‌ డివిజన్‌కు రూ.2857.85 కోట్లు కేటాయింపు

4 Feb, 2023 11:47 IST|Sakshi

విజయనగరం టౌన్‌:  ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే వాల్తేర్‌ డివిజన్‌కు 2023–24 బడ్జెట్‌లో రూ. 2857.85 కోట్లు కేటాయించినట్టు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో విజయనగరం–సంబల్‌ పూర్‌ (టిట్లాఘర్‌) మూడోలైన్‌ (264.60 కిలోమీటర్లు) నిర్మాణానికి  920 కోట్లు, కొత్తవలస–కోరాపుట్‌ (189.278 కిలోమీటర్లకు) రూ. 410 కోట్లు కేటాయింపులు జరిగాయన్నారు.

 గోపాలపట్నం–విజయనగరం వరకూ ఆటో సిగ్నలింగ్‌ వ్యవస్థ, బైపాస్‌లైన్‌లు ఏర్పాటుకు రూ. 32.78 కోట్లు, రోడ్డు సేఫ్టీ వర్క్స్, అండర్‌ బ్రిడ్జిలకు సంబంధించి గుమడ–పార్వతీపురం ఆర్‌ఓబీకి రూ.60 లక్షలు, పలాస–పూండి లైన్‌కు రూ.2.05 కోట్లు, పొందూరు–సిగడం రోడ్డు ఓవర్‌ బ్రిడ్జికి రూ.1.50 కోట్లు,  కోమటిపల్లి–గజపతినగరం ఆర్‌ఓబీ లెవెల్‌ క్రాసింగ్‌ రూ. 2లక్షలు, పలాస–పూండి, నౌపడలలో లిమిటెడ్‌ హైట్‌ సబ్‌వేస్‌కు రూ.3.71 కోట్లు,  కోటబొమ్మాళి–తిలారు, పలాస–పూండి,కోట బొమ్మాళి యార్డ్‌లలో లిమిటెడ్‌ హైట్‌ సబ్‌వేస్‌కు రూ.3.2కోట్లు, కొత్తవలస– కిరండాల్‌ సబ్‌వేస్‌ లెవెల్‌ క్రాసింగ్‌లకు రూ.78 లక్షలు, నౌపాడ–కోట బొమ్మాళి ఆర్‌ఓబీ సబ్‌వేకు రూ.2 కోట్లు, ఉర్లాం–శ్రీకాకుళం ఆర్‌ఓబీకి రూ.2 కోట్లు కేటాయింపులు చేశారని పేర్కొన్నారు.

 రైల్వే ట్రాక్‌ల ఆధునికీరణకు సంబంధించి పలాస–విశాఖ–దువ్వాడకు రూ.40 కోట్లు, కోరాపుట్‌ –సింగపూర్‌ లైన్‌కు రూ.20.01 కోట్లు, సింగపూర్‌ –విజయనగరం రోడ్డుకు రూ.25 కోట్లు కేటాయించారన్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది క్వార్టర్స్‌ ఆధునికీకరణ, రిపేర్లకు సంబంధించి రూ.15 లక్షలు కేటాయింపులు జరిగాయన్నారు. వీటితో పాటు సిగ్నల్‌ అండ్‌ టెలికమ్, వర్క్‌షాప్‌ ప్రొడక్షన్‌ యూనిట్స్, కొత్త లైన్లు, డబ్లింగ్‌ పనులు, రీమోడలింగ్స్, కొన్ని ప్రత్యేక గుర్తింపు పొందిన పనులకు నిధులు కేటాయించారన్నారు.      

మరిన్ని వార్తలు