వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్‌రెడ్డి

11 Jul, 2021 20:11 IST|Sakshi

విజయవాడ: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో అవకతవకలు జరిగినట్లు తమ ప్రాధమిక రిపోర్టుల్లో తేలిందని ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాలను ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. దాంతో ప్రభుత్వం వెంటనే సిఐడి విచారణకు ఆదేశించిందని వెల్లడించారు. సాక్షి తో ఏసీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరి గౌతం రెడ్డి ఆదివారం మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫైబర్ నెట్‌లో అవకతవలు జరిగాయని అన్నారు. ఫిబ్రవరిలోనే ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వంకు పంపించినట్లు తెలిపారు. కాంట్రాక్టర్లకు వందలాది కోట్లను దోచిపెట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కోట్లాది రూపాయల స్కాంలో ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర ఉందన్నారు.

కాంట్రాక్టుల విషయంలో ఈ అవకతవకలు జరిగాయని, వందల కోట్ల అవినీతి బయటపడింది అన్నారు. 650 కోట్ల అప్పు ఆయన చార్జి తీసుకునే సమయంలోనే ఉందని, అన్ని చోట్లా లాభాలు ఉంటే ఫైబర్‌లో మాత్రం అప్పులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ‘ఏసీ ఫైబర్‌లో ఇప్పుడు అప్పులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. నిజం నిగ్గు తేలుతుంది. సీఐడీ విచారణలో నాయకులంతా బయటకొస్తారు. పూర్తి అధారాలు మా వద్ద ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలు, చిన్నలు కూడా ఇందులో ఉన్నారు. సీఐడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఇందుకు బాధ్యులను గుర్తించాలి. రెండు, మూడు రోజుల్లోనే అన్ని విషయాలు బయటపెడతా.’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు