సంక్షేమం, అభివృద్ధి పనులను పూర్తిచేస్తాం

2 Sep, 2022 19:36 IST|Sakshi

నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అధికార్లతో సమన్వయం చేసుకుని సకాలంలో పూర్తిచేస్తామని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ గురువారం సచివాలయం నుంచి స్పందన, రీసర్వే కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షలో కలెక్టరేట్‌ నుంచి శివశంకర్‌ పాల్గొన్నారు.

భూముల రీసర్వే గురించి జిల్లాలో జరుగుతున్న పనుల వివరాలను సీఎస్‌కు వివరిస్తూ వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. సర్వే సిబ్బంది డ్రోన్ల రోవర్లు, అదనపు సిబ్బంది సహకారంతో పూర్తిస్థాయిలో లక్ష్యం చేరుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పులతో పడుతున్న వర్షాల కారణంగా కార్యక్రమంలో కొంత జాప్య మేర్పడిందని, అయినప్పటికీ త్వరితంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాదు, ప్రత్యేక కలెక్టర్‌ వసంతబాబు, డీడీవో మహాలక్ష్మి హాజరయ్యారు.  

మరిన్ని వార్తలు