ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు

15 Oct, 2020 18:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: ప్రస్తుతం కొనసాగుతున్న వాయుగుండం దక్షిణ మధ్య మహారాష్ట్ర ఆనుకుని ఉన్న దక్షిణ కోంకణ్ వద్ద  తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియర్ స్థాయిల వరకు కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్రకు దగ్గరలోని తూర్పు మధ్య అరేబియా సముద్రములోనికి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ అల్ఫపీడనం తదుపరి 48 గంటలలో మహారాష్ట్ర-దక్షిణ గుజరాత్ తీరాలను ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా దానిని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాలలో  వాయుగుండముగా బలపడే అవకాశం ఉంది.

ఈ వాయుగుండం క్రమేపి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు అరేబియా సముద్రం వరకు 18°N ఆక్షాంశాల వెంబడి ఉత్తరాంధ్ర, తెలంగాణ దక్షిణ మధ్య మహారాష్ట్ర దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోంకణ్ వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా 1.5కిమీ నుంచి 3.1కిమీ ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో అక్టోబర్‌ 19వ తేదీన  మధ్య అరేబియా సముద్రంలో మరోక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :   
ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణా కోస్తాంధ్ర, రాయలసీమలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే  శనివారం ఉత్తర, దక్షిణా కోస్తాంధ్రలతో పాటు రాయలసీమ, యానాంలో  ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు