Ap: మరో మూడు రోజులు ‘మంట’లే!

3 Jun, 2022 10:39 IST|Sakshi

అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో మూడు రోజల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటించింది. 83 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 157 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 46ని– 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

అలాగే మరికొన్ని జిల్లాల్లో 43ని నుంచి 45, మరికొన్ని జిల్లాల్లో 40–42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఈ మూడు రోజులు ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వడదెబ్బ తగలకుండా ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌), లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ తెలిపారు. 

చదవండి: పందులకూ ఓ పందెం! విజేతలకు రూ.2 లక్షల బహుమతి

మరిన్ని వార్తలు