నేడు, రేపు రాష్ట్రానికి వర్షసూచన

14 Sep, 2020 07:38 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. అదే ప్రాంతంలో ఆదివారం ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో సోమ, మంగళ వారాల్లో కోసాంధ్రలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమలోనూ రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉండనుంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి.  

మరిన్ని వార్తలు