ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

6 Feb, 2023 05:30 IST|Sakshi
మాట్లాడుతున్న కాకర్ల వెంకటరామిరెడ్డి

పదోన్నతులు, జీతాల పెంపు, వేతనాల విడుదలలో ముందడుగు

ప్రభుత్వంపై బురదజల్లే ఎల్లో మీడియా వైరస్‌ను తరిమి కొడదాం

ఏపీజీఈఎఫ్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి

నంద్యాల (అర్బన్‌): ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి సమస్యను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీ­స్‌ ఫెడరేషన్‌(ఏపీజీఈఎఫ్‌) చైర్మన్‌ కాకర్ల వెం­కట­రామిరెడ్డి తెలిపారు. ఆదివారం నంద్యా­లలో శ్రీనివాస సెంటర్‌ నుంచి టెక్కె మార్కెట్‌ యార్డు వరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మి­కులు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, పెన్షనర్లు దాదాపు 4 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం టెక్కె మార్కె­ట్‌ యార్డులో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 76 ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడేళ్ల­లో 3,798 మంది వీఆర్‌ఏలకు ప్రభుత్వం వీఆర్‌ఓ­లుగా పదోన్నతులు కల్పించిందన్నారు. వీఆర్‌ఓ­ల­కు సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతుల విషయం, ఇతరత్రా ఉద్యోగుల సమస్యలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.

25 ఏళ్లుగా ప్రమోషన్లకు నోచుకోని 230 మంది ఎంపీడీవోలకు పదోన్న­తులు.. కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగు­లకు 1వ తేదీనే ఆబ్కాస్‌ ద్వారా వేత­నా­లు..  సచివాలయ వ్యవస్థ ఏర్పా­టు ద్వారా 1.30 లక్షల మందికి శాశ్వత ఉద్యో­గాలు.. త్వరలో ఇంకో 14 వేల పోస్టుల భర్తీ.. ఇలా ఎన్నో విషయాల్లో ప్రభు­త్వం ముందుకు అడుగులు వేసిందని చెప్పారు.

రాధాకృష్ణా.. మీ ముత్తాతలు దిగిరావాలి
సెక్రటేరియేట్‌ ఎన్నికల్లో నేను ఓడిపోతానని ‘ఆంధ్రజ్యోతి’లో రాధాకృష్ణ ఎడిటోరియల్‌ రాశారు. సంపూర్ణ మెజార్టీతో గెలిస్తే.. జగన్‌ బంటు ఎలా గెలిచారని మరో కథనం రాసి రాక్షసానందం పొందారు. జగన్‌ బంటునే ఓడించలేని రాధాకృష్ణ.. జగన్‌ను ఓడించగ­లరా? చెత్త మాటలు.. చెత్త రాతలు.

మీ తాత ముత్తాతలు దిగి వచ్చినా ఈ ప్రభుత్వాన్ని ఓడించలేరు. ఈ ఎల్లో మీడియా వైరస్‌ను ప్రభుత్వ ఉద్యోగులు తరిమి కొట్టాలి. అవ­సరమైనప్పుడు ఉద్యోగులంతా ప్రభుత్వానికి అండగా ఉండాలి. 

మరిన్ని వార్తలు