మంత్రి తానేటి వనితకు మాతృ వియోగం

9 Aug, 2021 10:30 IST|Sakshi
జొన్నకూటి సుశీల (ఫైల్‌)

కొవ్వూరు: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాతృమూర్తి సుశీల (76) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జొన్నకూటి బాబాజీరావు సతీమణి అయిన సుశీల ఉపాధ్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రెండో కుమార్తె వనిత గతంలో గోపాలపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎన్నికై రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కాగా, తాళ్లపూడి మండలం తుపాకులగూడెంలోని ఫామ్‌హౌస్‌లో సుశీల అంత్యక్రియలు నిర్వహించారు. 

సీఎం పరామర్శ..
మంత్రి తానేటి వనిత మాతృమూర్తి సుశీల మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మంత్రి వనితకు ఫోన్‌ చేసి పరామర్శించారు. వారి కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. కాగా, మంత్రి తానేటి వనితను, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావును హోం మంత్రి  సుచరిత ఆదివారం పరామర్శించారు.

మరిన్ని వార్తలు