శీతల్‌ చేప ధర ఎంతో తెలుసా!

5 Apr, 2021 14:52 IST|Sakshi

సాక్షి, ఆకివీడు(పశ్చిమ గోదావరి) : శీతల్‌ చేపలు మార్కెట్‌లో తళుక్కు మంటున్నాయి. సముద్ర జాతికి చెందిన ఈ చేపల్ని చెరువుల్లో పదుల సంఖ్యలో వేసి పెంచుతున్నారు. ఇది పూర్తి మాంసాహారి చేప. శీతల్‌ చేప చెరువుల్లోని గురకల్ని, ఇతర చిన్న చేపల్ని తినేస్తుంది. దీంతో ఇది భారీ సైజులో పెరుగుతుంది. 3 కిలోల నుండి 8 కిలోల పైబడి బరువు తూగుతుంది. కిలో చేప ధర రూ.350 వరకూ స్థానిక మార్కెట్‌లో పలుకుతోంది. కేరళ, అసోం, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఈ చేపకు డిమాండ్‌ అధికంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం స్థానిక హోల్‌సేల్‌ మార్కెట్‌కు 5 కిలోల శీతల్‌ చేపలు అమ్మకానికి తీసుకువచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు