నా భర్త నాకు కావాలి.. భార్య నిరసన...

2 Jul, 2021 09:25 IST|Sakshi
భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తున్న లావణ్యతో మాట్లాడుతున్న మహిళా కానిస్టేబుల్‌

న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ఆందోళన 

గోపాలపట్నం: తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య నిరశన చేపట్టిన ఘటన గురువారం కోటనరవలో సంచలనం రేపింది. బాధితురాలు, స్థానికుల కథనం ప్రకారం మల్కాపురానికి చెందిన లావణ్యకు కోటనరవకు చెందిన దొడ్డి త్రినాథ్‌తో 2017లో వివాహం జరిగింది. వీరి కాపురం కొన్నాళ్లు బాగానే సాగింది. ఆ తర్వాత ఆడపడుచులు, అత్త, ఇతర కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువ కావడంతో స్థానిక పెద్దల సమక్షంలో గొడవలు సద్దుమనిగేలా చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం లావణ్యకు త్రినాథ్‌ విడాకుల నోటీసు పంపించాడు. మరో పెళ్లి చేసుకునేందుకే విడాకుల నోటీసులు పంపించారని, తనకు భర్త కావాలని ఆమె వేడుకుంటోంది. తనకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకూడదని, తన భర్త తనకు కావాలని వేడుకొంటోంది. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు ఆందోళన చేపట్టిన మహిళను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు