రక్తపు మడుగులో అనురాధ..15 సార్లు.. కత్తెర పోట్లు..

6 Mar, 2022 09:19 IST|Sakshi

శ్రీకాకుళం (ఆమదాలవలస) : ఆమదాలవలస ఉలిక్కిపడింది. మహిళ ను కర్కశంగా హత్య చేశార న్న వార్తతో శనివారం పట్ట ణం నిద్ర లేచింది. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో రైల్వే పాత గేటు ప్రాంతంలో శుక్రవారం రాత్రి పాతిన అనురాధ (31) అనే మహిళను దారుణంగా హత్య చేశారు. ఆమదాలవలస సీఐ పైడయ్య తెలిపిన వివరాల ప్రకారం.. 

ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి నందగిరిపేటకు చెందిన పాతిన అనురాధ(31)ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తెరతో మెడపై పొడిచి హత్య చేశారు. మెడపై దాదాపు 15 కత్తెర పోట్లను పోలీ సులు గుర్తించారు. అనురాధకు నందగిరిపేటకు చెందిన అప్పలనాయుడుతో వివాహమైంది. అయి తే వీరి దాంపత్యం ఎంతోకాలం సాగలేదు. ఆయనతో విడిపోయాక అనురాధ ఆమదాలవలస గేటు ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈమెకు 12 ఏళ్ల అమ్మాయి ఉంది. పలు ఇళ్లలో పనులు చేసుకుంటూ ఈమె బతుకుతోంది. 

ఈమె ఉంటున్న వీధిలోనే మరో ఇంటిలో ఆమె తల్లి గురుగుబెల్లి అమ్మలమ్మ నివాసముంటున్నారు. శనివారం ఉదయం కూతురి ఇంటికి వెళ్లిన అమ్మల మ్మ తలుపు తెరిచి చూసే సరికి రక్తపు మడుగులో అనురాధ కనిపించింది. దీంతో ఆమె హతాశురాలై ఇరుగు పొరుగు వారిని పిలిచి పోలీసులకు సమా చారం అందించారు. సీఐ పైడయ్య తన సిబ్బంది తో పాటు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌తో అక్కడకు చేరుకున్నారు. అనురాధ ఇటీవల ఓ చీటీ పాటను పాడి ఆ డబ్బులు ఇంటిలోనే ఉంచుకుంది. ఈ డబ్బు కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తు న్నట్లు సీఐ తెలిపారు. మృతురాలి ఫోన్‌ కాల్‌ డేటా సేకరించి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతు రాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.   

పోలీసులే దగ్గరుండి.. 
అనురాధ మృతదేహాన్ని పోలీసులు రిమ్స్‌కు తరలించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తల్లి వృద్ధురాలు కావడం, కుమార్తె ఇంకా చిన్నపిల్ల కావడంతో దహన సంస్కారాలు చేసేందుకు ఎవరూ లేకపోయారు. దీంతో పోలీసులే దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. 

మరిన్ని వార్తలు