ప్రేమ పేరుతో ఎస్‌ఐ వంచన

7 May, 2022 12:13 IST|Sakshi
సరస్వతి ( ఫైల్‌ ఫోటో )

అనంతపురం : ఎస్‌ఐ చేతిలో వంచనకు గురై ఆత్మహత్యాయత్నం చేసిన యువతి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ...పామిడి మండలం గురుమాంజనేయ (జీఏ) కొట్టాలకు చెందిన రమావత్‌ విజయ్‌కుమార్‌నాయక్‌ తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఈయన అనంతపురానికి చెందిన భారతిని ప్రేమించాడు. అయితే పెళ్లికి ససేమిరా అనడంతో ఆమె “దిశ’ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించింది. తొమ్మిది నెలల క్రితం పెళ్లితో ఈ ప్రేమ కథ సుఖాంతమైంది. 

అయితే విజయ్‌కుమార్‌ తన స్వగ్రామానికి చెందిన తిరుపాల్‌నాయక్‌ కుమార్తె సరస్వతితోనూ ప్రేమాయణం నెరిపాడు. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. రెండు రోజుల క్రితం సరస్వతి జీఏ కొట్టాలలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. సరస్వతి తండ్రి తిరుపాల్‌నాయక్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ విజయకుమార్‌పై పామిడి సీఐ ఎం.ఈరన్న కేసు నమోదు చేశారు. విజయ్‌కుమార్‌ ఎస్‌ఐ కాక ముందు గుంతకల్లు మున్సిపాలిటీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఓ మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో వంచించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు