పిల్లల్ని ఒంటరి చేసి వెళ్లిపోయావా.. ఎందుకిలా చేశావ్‌ మమత!

18 Sep, 2022 08:15 IST|Sakshi

గుడివాడరూరల్‌: వివాహిత కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.  వివరాల ప్రకారం.. మందపాడుకు చెందిన తాడి మమత (26) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది.

ఈ క్రమంలో ఆ  ఇబ్బందులు తాళలేక శుక్రవారం రాత్రి పామర్రు రోడ్డులోని పెదకాల్వలో దూకింది. స్థానికులు చూసి వెంటనే టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో వెతుకులాట ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో శనివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా 10 గంటల తర్వాత బాపూజీనగర్‌ లాకుల వద్ద మమత మృతదేహం  లభించింది. 

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త తాడి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు టూటౌన్‌ ఎస్‌ఐ వి.రాజేంద్రప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు