సూపర్‌వాస్మోల్‌ తాగి భర్తను భయపెట్టాలనుకుంది..

3 May, 2021 12:55 IST|Sakshi
గారాలమ్మ (ఫైల్‌)  

టెక్కలి రూరల్‌: నిత్యం మద్యం తాగుతున్న భర్తలో మార్పు తీసుకురావాలని భార్య ప్రయత్నించింది. సూపర్‌వాస్మోల్‌–33 తాగి చచ్చిపోతానని భయపెట్టాలని చూసింది. అయితే ఆమె ప్రయత్నం వికటించింది. ప్రాణాన్ని పోగొట్టుకుంది. ఈ విషాద ఘటన టెక్కలి మండలం నర్సింగిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకోగా.. తోపల గారాలమ్మ (52) మృత్యువు ఒడిలోకి చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గారాలమ్మ భర్త అప్పన్న నిత్యం మద్యం తాగివచ్చి ఆమెతో గొడవ పడుతుండేవాడు. దీంతో భర్తతో మద్యం మానిపించాలనే ఉద్దేశంలో భాగంగా అతన్ని జడిపించేందుకు ఇంట్లో ఉన్న సూపర్‌వాస్మోల్‌–33ను గారాలమ్మ తాగింది. అపస్మారకస్థితికి చేరుకున్న ఆమెను కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. గారాలమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

చదవండి: కోవిడ్‌ సెంటర్లలో రెచ్చిపోతున్న కామాంధులు
ప్రేయసిపై కన్నేసిన కంప్యూటర్‌ సెంటర్ యజమాని, దాంతో

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు