ఉద్యోగంలో చేరిన పది రోజులకే యువతి మృతి.. ఏం జరిగిందంటే?

9 Jun, 2022 09:22 IST|Sakshi
విజయకుమారి (ఫైల్‌)

మలికిపురం(కోనసీమ జిల్లా): ఆ యువతి పట్టుదలతో చదివింది. ఎంఎల్‌హెచ్‌పీ పూర్తి చేసింది. ఆరోగ్య శాఖలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. అనుకున్నది సాధించింది. అంతలోనే విధి వక్రీకరించింది.  స్వల్ప అనారోగ్యం తీవ్ర రూపం దాల్చి ఆ యువతిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. మలికిపురం మండలం గొల్లపాలెంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఏఎన్‌ఎం నల్లి విజయకుమారి (21) ఆకస్మిక మృతి చెందింది. ఇటీవలే ఆమెకు ఏఎన్‌ఎంగా ఉద్యోగం రావడంతో పి.గన్నవరం మండలం ఏనుగుపల్లి పీహెచ్‌సీలో విధులలో చేరారు.
చదవండి: టీవీ రిపోర్టర్‌నంటూ.. మహిళపై లైంగికదాడి.. ఆ దృశ్యాలను రికార్డింగ్‌ చేసి..

విధులలో చేరి పది రోజులు కూడా కాలేదు. ఇటీవల ఆమెకు స్వల్ప అనారోగ్యం రావడంతో రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు బుధవారం విజయకుమారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆమె తండ్రి ఎంపీటీసీ మాజీ సభ్యుడు నల్లిదాసును పరామర్శించారు. ఎంపీపీ కేతా శ్రీను, ఎంపీటీసీ సభ్యురాలు మట్ట అనంత లక్ష్మి, సర్పంచ్‌లు మందపాటి నాగేశ్వరావు యెనుముల నాగు, రాపాక ఆనందకుమార్‌ పరామర్శించిన వారిలో ఉన్నారు. 

మరిన్ని వార్తలు