మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై

1 Feb, 2021 15:49 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ‘దైవం మనుష్య రూపేణా’.. అనే నానుడిని ఓ మహిళ పోలీస్‌ అధికారిణి అక్షరాలా రుజువు చేసింది. ముక్కు, ముఖం తెలియని ఓ మృతదేహాన్ని తన భుజాల మీద మోసి పలువురికి ఆదర్శంగా నిలిచింది. పోలీసు అధికారిణి చేసిన పని.. ఏ ఆపద వచ్చినా పోలీసులు ముందుంటారనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో ఆవిష్కృతమైంది.

వివరాలు.. పలాసలోని కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతదేహం లభ్యమైంది. అయితే మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష.. తానే స్వయంగా మృతదేహాన్ని మోసుకుని లలితా చారిటబుల్ ట్రస్ట్‌కు ఆప్పజెప్పారు. కాగా శిరీషా చూపిన తెగువను పోలీసు అధికారులు అభినందిస్తున్నారు.

చదవండి: మా మంచి సారు.. నరేంద్ర..!

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు