నాగలి పడుతున్న నారీమణులు..దేశంలో పెరుగుతున్న మహిళా రైతులు

22 Jan, 2023 15:08 IST|Sakshi

వారికి అనువైన వ్యవసాయ యంత్రాలను తయారు చేయాలి

చిన్న భూకమతాలకు అనువైన యంత్రాలను ప్రోత్సహించాలి 

ప్రస్తుతం పెద్ద భూకమతాలకు అనువైన యంత్రాలే ఉన్నాయి 

దేశంలో గత 15 ఏళ్లలో 14.6 కోట్ల రైతుల్లో ట్రాక్టర్లు కొన్న వారు 90 లక్షలే 

రాష్ట్రంలో 2019–20లో 18,335 ట్రాక్టర్లు కొనుగోలు 

2021–22లో రాష్ట్రంలో 33,876 ట్రాక్టర్లు కొనుగోలు 

వ్యవసాయ యాంత్రీకరణపై నాబార్డు అధ్యయన నివేదిక

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వ్యవసాయంలో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నే­ష­నల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డు) వెల్లడించింది. మహిళా రైతుల సంఖ్య పెరుగుతున్నందున వారికి అనువైన వ్య­వ­సా­య యంత్రాలను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 2010–11 గ­ణాం­కాల ప్రకారం వ్యవసాయం చేసే మహిళలు దే­శంలో 12.79 శాతం ఉండగా 2015–16లో 13.87 శాతానికి పెరిగినట్లు తెలిపింది.

ఇదే సమయంలో మహిళా రైతులు వ్యవసాయ చేసే విస్తీర్ణం కూడా 10.36 శాతం నుంచి 11.57 శాతానికి పెరిగింది. అందువల్లమహిళలకు అనుకూలమైన యంత్ర పరి­కరాలు అందుబాటులోకి రావాల్సి ఉందని దేశంలో వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణపై నాబార్డు అధ్యయన నివేదికలో తెలిపింది. వ్యవసాయ రంగం అభివృద్ధికి పలు సూచనలు చేసింది.  

యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాలి 
ప్రస్తుతం దేశంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రారంభ దశలోనే ఉందని, యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాల్సి ఉందని స్పష్టంచేసింది. దేశంలో మొత్తం వ్యవసాయ భూకమతాల్లో 85 శాతం చిన్నవేనని, వీటిలో యంత్రాల వాడకం ప్రధాన సవాలుగా ఉందని నివేదిక తెలిపింది. కిరాయి, అద్దె మార్కెట్లు ఉన్నప్పటికీ చిన్న కమతాలకు పరిమితులు, సంక్లిష్టతలున్నాయని తెలిపింది.

2014–15లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ ఉపమిషన్‌ ప్రారంభించినప్పటికీ, చిన్న కమతాలకు ఉపయోగకరంగా లేదని తెలిపింది. వ్యవసాయ  యంత్రాలు, పనిముట్లు పెద్ద కమతాలకు అనువైనవే ఉన్నాయని తెలిపింది. చిన్న భూకమతాలకు అనువైన యంత్రాలను, పనిముట్లను ప్రోత్సహించాలని పేర్కొంది. 

యాంత్రీకరణతో రైతులకు లాభం 
యాంత్రీకరణతో రైతులకు లాభమని నాబార్డు పేర్కొంది. ట్రాక్టర్లు, సీడ్‌ డ్రిల్స్, హార్వెస్టర్లు, కంబైన్‌లు వంటి యంత్రాలు కార్మికులకయ్యే ఖర్చును ఆదా చేస్తాయని నివేదిక తెలిపింది. యంత్రాలు, సాంకేతికతతో వ్యవసాయ ఉత్పాదకత సామర్థ్యాన్ని 30 శాతం వరకు పెంచడంతోపాటు సాగు ఖర్చును 20 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైనట్లు స్పష్టం చేసింది.

వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగంతో కారి్మకులు వ్యవసాయేతర రంగాల్లో పనిచేసేందుకు అందుబాటులో ఉంటారని తెలిపింది. కారి్మకులకు వ్యవసాయంలోకంటే వ్యవసాయేతర రంగాల్లో ఎక్కువ వేతనాలు లభిస్తాయని వెల్లడించింది. 

నాబార్డు సిఫార్సులు మరికొన్ని.. 
రైతుల సముదాయంతో రైతుల ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసి 
వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను ఉపయోగించుకొనేలా చేయాలి 
చిన్న, సన్నకారు రైతులకు రుణ పరిమితులను సడలించాలి 
అందుబాటులో ఉన్న వ్యవ వినియోగంలో కొండ ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ఉన్న భూభాగం, స్థలాకృతికి సరిపోవు. కొండ ప్రాంతాలలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ప్రత్యేక పనిముట్లు అవసరం. ఆ భూభాగం, పంట వ్యవస్థలకు సరిపోయే విధంగా పనిముట్లు రూపొందించాలి. 
ప్రస్తుతం ఉన్న యంత్రాలు, పనిముట్లు స్త్రీలకు అనుకూలమైనవి కావు. వ్యవసాయంలో మహిళల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్త్రీలకు అనుకూలమైన కొత్త యంత్రా­లు, పనిముట్లను అందుబాటులోకి తేవాలి.  

ట్రాక్టర్ల కొనుగోలులోనూ వెనుకబాటు 
దేశంలో 14.6 కోట్ల మంది రైతుల్లో గత 15 సంవ­త్సరాల్లో ట్రాక్టర్లు కొనగలిగిన వారు అతి తక్కువని పేర్కొంది. 2004–05 ఆరి్థక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రైతులు 2.48 లక్షల ట్రాక్టర్లు కొనగా, 2019–20లో 8.80 లక్షల ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. ట్రాక్టర్ల కొనుగోలులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలున్నాయని చెప్పింది. 2019–20­లో ఆంధ్రప్రదేశ్‌లో 18,335 ట్రాక్టర్ల కొనుగోళ్లు జరగ్గా 2021–22 లో 33,876 ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. 2021–22లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1,17,563, మహారాష్ట్ర 1,04,301, మధ్య­ప్రదేశ్‌లో 1,00,551 ట్రాక్టర్లు కొన్నట్లు పేర్కొంది.
చదవండి: అంతరిస్తున్న తోడేళ్లు! ఉమ్మడి అనంతపురంలో భారీగా తగ్గిన వన్యప్రాణులు

మరిన్ని వార్తలు