మహిళల భద్రత కోసం ‘దిశ’ చట్టం: సుచరిత

7 Sep, 2021 17:17 IST|Sakshi
మేకతోటి సుచరిత (ఫైల్‌ ఫోటో)

సాక్షి, గుంటూరు: మహిళల భద్రత కోసం ‘దిశ’ చట్టం తీసుకొచ్చినట్లు హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. శాసనసభ, మండలిలో దిశ చట్టాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాం.. కేంద్రం ఆమోదించగానే వెంటనే అమలు చేస్తామని పేర్కొన్నారు. దిశ యాప్‌తో ఇప్పటికే చాలామంది మహిళలను రక్షించినట్లు చెప్పారు.

దిశ చట్టాన్ని కేంద్రం ఇంకా ఆమోదించలేదనే విషయం చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ తెలుసని తెలిపారు. దిశ చట్టాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. దిశ చట్టం కింద కొన్ని ప్రత్యేకమైన నేరాలు వస్తాయని ముందుగా లోకేష్ తెలుసుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం హయాంలో మహిళల రక్షణ ఏ విధంగా ఉందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.

చదవండి: నూతన విద్యా విధానం అమలుపై సిద్ధం కావాలి: సీఎం జగన్‌

విద్యాదీవెన, ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లపై అప్పీల్‌కు వెళ్తాం..

మరిన్ని వార్తలు