కాఫీ పొడితో అంబేడ్కర్‌ అద్భుత చిత్రం

14 Apr, 2021 14:32 IST|Sakshi

గాజువాక: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ చిత్రాన్ని కాఫీపొడితో తయారు చేసి ఆయన పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు విశాఖపట్నం దత్తసాయినగర్‌కు చెంది న నాయన సురేష్‌. గాజువాక ప్రాంతంలోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో డ్రాయింగ్‌ టీచర్‌గా పనిచేస్తున్న సురేష్‌ తీరిక సమయంలో వరిగడ్డి, చీపురు పుల్లలు, కాగితాలతో కళాఖండాలు రూపొందిస్తుంటారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని తాజాగా కాఫీపొడితో చిత్రాన్ని రూపుదిద్దారు. దీని రూపకల్పనకు రెండు గంటలు పట్టినట్లు సురేష్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు