ఏపీ: పోలీస్‌ శాఖలో గర్భిణులకు ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’

16 May, 2021 09:56 IST|Sakshi

అన్ని పోలీస్‌ యూనిట్లకు డీజీపీ సవాంగ్‌ ఆదేశాలు

సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్ర పోలీస్‌ శాఖలో గర్భిణులు ఇంటి నుంచే పనిచేసేలా (వర్క్‌ ఫ్రం హోమ్‌) వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ శనివారం రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ యూనిట్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 18 పోలీస్‌ యూనిట్ల పరిధిలో పనిచేస్తున్న మహిళా పోలీస్‌ సిబ్బంది, వారిలో గర్భిణుల వివరాలను రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి వెంటనే పంపాలని ఆయన ఆదేశించారు.

గర్భిణులు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించేలా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. వారి ఆరోగ్యం, వారికి అందుతున్న వైద్య సేవలపై పోలీస్‌ హెల్ప్‌డెస్క్‌నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సహకారం అందించాలని ఆదేశించారు. ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని గర్భిణులు, మహిళల పట్ల కోవిడ్‌ సమయంలో శ్రద్ధ వహించాలని డీజీపీ స్పష్టం చేశారు.

చదవండి: కానిస్టేబుల్‌ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే దుద్దుకుంట   
కుట్రలు బయటపడతాయని బాబు గగ్గోలు

మరిన్ని వార్తలు