ప్రభుత్వ పాఠశాలలపై ఏపీ విజన్‌కు ప్రపంచబ్యాంక్‌ సహకారం

23 Nov, 2021 20:28 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న ఆంధ్రప్రదేశ్‌ విజన్‌కు సహకారం అందించడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది.  విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం ప్రపంచ బ్యాంకుతో ఏపీ, కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాయి. 
(చదవండి: మనోళ్లు పంపింది 83 బిలియన్‌ డాలర్లు..!)

250 మిలియన్ డాలర్లతో 50 లక్షల మంది విద్యార్థుల ప్రమాణల పెంపుకు ప్రత్యేక ప్రాజెక్టు తీసుకురాన్నున్నారు. దీనివల్ల 45 వేల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, టీచర్లు, అంగన్వాడీ సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. టీచర్లలో నైపుణ్యం పెంచడంపై దృష్టి పెట్టనున్నారు. 


(చదవండి: వచ్చే ఏడాది నుంచి పాఠశాలలకు ర్యాంకింగ్‌ విధానం అమలు)

ఈ ప్రాజెక్ట్‌లో పేద, గిరిజన విద్యార్థులు, బాలికలకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. అంగన్వాడి టీచర్లకు, సిబ్బందికి ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ వసతులు లేక విద్యలో నష్టపోతున్న పేద గిరిజన విద్యార్థుల కోసం టెలివిజన్,  రేడియోలో ప్రత్యేక కంటెంట్ రూపకల్పన చేయాలని భావిస్తున్నారు.  కరోనా లాంటి మహమ్మారులతో విద్యార్థులు నష్ట పోకుండా ఉండే దిశగా చర్యలు తీసుకోనున్నారు.

చదవండి: ఏపీ విద్యా వ్యవస్థ భేష్‌

మరిన్ని వార్తలు