మేకపాటి మృతి పట్ల వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం దిగ్భ్రాంతి

1 Mar, 2022 20:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అకాలమరణం పట్ల వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంతో పా టు పలు విదేశీ సంస్థలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ మధ్యనే ఢిల్లీలో మేకపాటితో కలిసి చర్చలు జరిపామని, ఇంతలోనే ఇటువంటి వార్త దిగ్భాంత్రికి గురిచేసిందంటూ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం తన సంతాప సందేశంలో పేర్కొంది.

వారం రోజుల క్రితమే రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ఆయన సమక్షంలో ఒప్పందం చేసుకున్నామని, ఆయన మరణించినా రాష్ట్రంలో పెట్టుబడుల సంబంధాన్ని కొనసాగించడం ద్వారా ఆయ న ఆత్మకు శాంతిని చేకూరుస్తామని రీజెన్సీ గ్రూపు చైర్మన్‌ ఎస్‌బీ హాము హజీ పేర్కొన్నారు.

చదవండి: (ఏపీ కేబినెట్‌ భేటీ మార్చి 7కి వాయిదా)

దుబాయ్‌ పర్యటనలో మంత్రిగా మేకపాటి నిబద్ధత, నిరాడంబరత మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని, వారం రోజు ల్లోనే ఇలాంటి వార్త హృదయాలను కలచివేసిందని షరాఫ్‌ గ్రూపు వైస్‌ చైర్మన్‌ షరాబుద్ధీన్‌ షరాఫ్‌ పేర్కొన్నారు. జీ42 గ్రూపు, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా దుబాయ్‌ చాప్టర్‌ మేకపాటి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశాయి.  

మరిన్ని వార్తలు