సీఎం జగన్‌కు యడవల్లి దళిత రైతులు సత్కారం

23 Nov, 2021 07:52 IST|Sakshi

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు

రూ.30 కోట్ల పరిహారమివ్వడంపై హర్షం  

సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఎడతెగని పోరాటం చేసిన తమకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ న్యాయం చేశారని గుంటూరు జిల్లా యడవల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు పేర్కొన్నారు. తమ భూములకు ప్రభుత్వం తరపున రూ.30 కోట్ల పరిహారం చెల్లించడం ద్వారా.. ఇచ్చిన మాటను సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారని తెలిపారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఆధ్వర్యంలో యడవల్లి దళిత రైతులు సోమవారం శాసనసభలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారంగా ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌ను సత్కరించారు. 

మరిన్ని వార్తలు