వైజాగ్‌పై ఎల్లో మీడియా అక్కసు: అమర్‌నాథ్‌

27 Aug, 2020 17:30 IST|Sakshi

సాక్షి, తాడేప‌ల్లి :  పరిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్‌డీఏ ర‌ద్దు చ‌ట్టాల‌పై సుప్రీంకోర్టు తీర్పును చంద్ర‌బాబు ఎల్లో మీడియా వక్రీకరించి రాస్తోంద‌ని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్ అన్నారు. త్వరగా కేసు పూర్తి చేయాలన్న సుప్రీం వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రిస్తున్నారని మండిప‌డ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పత్రిక విలువలను ఎల్లో మీడియా కాలరాస్తూ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా  వార్తలు రాయ‌డాన్ని ఆయన ఖండించారు.  మూడు రాజధానుల పక్రియ ప్రారంభించినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో అడ్డుకోవాలని ఎల్లో మీడియా చూస్తోందని, ప్రజలు ఆకాంక్షకు అనుగుణంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటే కుట్రలు కుతంత్రాలు చేస్తోందని మండిప‌డ్డారు. ఎల్లో మీడియా ఫోర్త్ ఎస్టేట్ కిందకు రాదు ఎల్లో ఎస్టేట్ కింద వస్తుందని, ఇప్పటికైనా చంద్రబాబు భజన మానుకోవాలని హిత‌వు ప‌లికారు. (చంద్రబాబును దళిత జాతి ఎప్పటికీ క్షమించదు)

వైజాగ్‌లో పరిపాలన రాజధాని, కర్నూల్‌లో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంట‌ని సూటిగా ప్ర‌శ్నించారు. రాష్ట్రం కోసం వైఎస్ జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తే చంద్ర‌బాబు అమ‌రావ‌తిలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. 14 నెలల కాలంలో సంక్షేమం కోసం  60 వేల కోట్ల  రూపాయ‌లు ఖర్చు చేసిన సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మినహా దేశంలో మరొకరు లేరని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ప్రమాదం జరిగిన విశాఖపట్నంకు ముడి పెడుతుండ‌టం ఏంట‌ని అమ‌ర్‌నాథ్ సూటిగా ప్ర‌శ్నించారు. (మూడు రాజధానులు: రోజూవారి విచారణ జరపండి)

మరిన్ని వార్తలు