ముగిసిన వైవీయూ డిగ్రీ పరీక్షలు  

15 May, 2022 23:21 IST|Sakshi
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తున్న ఈశ్వరరెడ్డి  

వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రథమ, తృతీయ సెమిస్టర్‌ పరీక్షలు శనివారం సాయంత్రంతో ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 10 రోజుల పాటు నిర్వహించిన పరీక్షల్లో మొత్తం మీద 90 మంది విద్యార్థులు డీబార్‌ అయ్యారు. కాగా రాయచోటిలోని హెచ్‌ఎం డిగ్రీ కళాశాలలో జరిగిన ఘటన మినహా మిగతా అన్ని చోట్ల పరీక్షలు ప్రశాంతంగా సాగాయి.

ఈ పరీక్షలకు 25,301 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా చివరిరోజు పరీక్షల్లో పలు కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఎన్‌. ఈశ్వరరెడ్డి తనిఖీ చేశారు. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, ఒంటిమిట్ట డిగ్రీ పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. శనివారం పరీక్షల్లో నలుగురు డీబార్‌ అయినట్లు ఆయన తెలిపారు. వీసీ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్‌ ఆచార్య డి. విజయరాఘవప్రసాద్‌ మార్గదర్శనంలో పరీక్షలను సజావుగా, కట్టుదిట్టంగా నిర్వహించామన్నారు. 

మరిన్ని వార్తలు