అనకాపల్లి టు చైనా.. తిరుగులేని డ్యాన్సర్‌గా విజయ్‌

5 Jul, 2021 08:59 IST|Sakshi

డ్యాన్సర్‌గా అంతర్జాతీయ ఖ్యాతి

థాయ్‌లాండ్, బ్యాంకాకుల్లోనూ ఆదరణ

యోగాలోనూ అవార్డులు సొంతం

కొణతాల విజయ్‌కు చైనాలో క్రేజ్‌

పాఠశాల వార్షికోత్సవాల్లో డ్యాన్స్‌ ప్రదర్శనతో ప్రారంభమైన ఆ యువకుడి ప్రస్థానం ఖండాంతరాలను దాటింది.. ఆ కళాకారుడి నృత్యానికి ఫిదా అయిన అభిమానులు అతన్ని అందలమెక్కించారు. ఉత్తరాంధ్ర స్థాయిని దాటి టీవీ చానళ్లలో డ్యాన్స్‌ కార్యక్రమాల ద్వారా రాష్ట్రస్థాయి ఇమేజిని సంపాదించాడు. విదేశాల్లో ప్రదర్శనల్చి, అక్కడి కళాభిమానులనూ ముగ్ధులను చేశాడు. అలా థాయిలాండ్‌లో కొన్నాళ్లు నృత్య శిక్షణ ఇచ్చి.. చైనాలో స్థిరపడ్డాడు. యోగాలోనూ ప్రావీణ్యం సంపాదిం అవార్డులెన్నో అందుకున్నాడు. అనకాపల్లిలో పుట్టి పెరిగిన కుర్రాడు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు.

సాక్షి, అనకాపల్లి: ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కొణతాల విజయ్‌.. పేరుకు తగ్గట్టు విజయానికి చిరునామాగా మారాడు. ఆ గుర్తింపు అతనికి అంత సులువుగా రాలేదు. దాని వెనుక ఎంతో కృషి, తపన ఉంది. సూరి అప్పారావు, కాంతకుమారిల ముగ్గురు కొడుకుల్లో మధ్యవాడు విజయ్‌. విశాఖ జిల్లా అనకాపల్లిలో పాఠశాల వార్షికోత్సవాల్లో నృత్యాలు చేస్తూ విజయ్‌ గ్రూప్‌ను స్థాపించాడు. తండ్రితోపాటు అన్నయ్య కూడా చిన్నప్పుడే చనిపోవడంతో తల్లిని, సోదరుడ్ని చూసుకునే భారం అతనిపై పడింది. అయినా సరే తన అభిరుచిని వీడలేదు. తన టీం ద్వారా విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్రలోనూ మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు పొందాడు.

కొత్తగా ప్రారంభమైన జెమినీ టీవీ షోలో అవకాశమ్చొంది. మొదటి ప్రయత్నంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన విజయ్‌ బృందం ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందింది. చిరంజీవి, లారెన్స్‌ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన విజయ్‌ హైదరాబాద్‌కు మకాం మార్చాడు. జీ తెలుగు చానల్‌లో ‘డేర్‌ టూ డ్యాన్స్‌’ ప్రోగ్రాంలో యాంకర్‌గా వ్యవహరించిన అనంతరం ఆ గుర్తింపుతో అంతర్జాతీయ వేదికలపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లలో డ్యాన్స్‌ మాస్టర్‌గా ఎంతోమందికి శిక్షణ ఇచ్చాడు.

నాన్న, అన్నయ్య ఉంటే గర్వపడేవారు
పదహారేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాను. చిన్నప్పుడు నా నృత్య ప్రదర్శనలు చసి అన్నయ్య ఎంతో సంతోషించేవాడు. ఈ స్థాయికి వచ్చానని తెలిస్తే ఎంతో గర్వపడతాడు. కానీ నాకు ఆ అదృష్టం లేదు. అన్నయ్య ఆశయం మేరకు డ్యాన్స్‌లో రాణించాను. పద నర్తన నాకో ప్యాషన్‌. ఆ అభిరుచే నన్ను ఇంతవాణ్ని చేసింది. ఆదరించిన కళాభిమానులకు కృతజ్ఞణ్ని.
– కొణతాల విజయ్‌ 

చైనాలో రాణింపు...
థాయ్‌లాండ్‌లో స్థిరపడిన విజయ్‌కు చైనాకు సంబంధింన వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. విజయ్‌ ప్రతిభను గుర్తించిన చైనా మిత్రులు అక్కడికి రమ్మని ఆహ్వానించడంతో డ్యాన్స్‌ నేర్పేందుకు ఆ దేశానికి వెళ్లాడు. కొరియోగ్రఫీ చేస్తూ అక్కడ టీవీ చానళ్లలో కూడా డ్యాన్స్‌పై పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. వివాహం అయిన తర్వాత విజయ్‌ ప్రస్థానం మరో మలుపు తిరిగింది. ఫిట్‌నెస్‌ కోసం యోగా నేర్చుకున్న అతను ఆ శాస్త్రంలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు.

మహిళలు గర్భం ధరించిన సమయంలో చేయగల యోగాసనాల్లో శిక్షణ ఇవ్వగల స్థాయికి చేరుకున్నాడు. గర్భిణిగా ఉన్న తన భార్యతో ఆసనాలు వేయించి రికార్డులను నెలకొల్పాడు. ఇటీవల అష్టవక్రాసనం, మయూరాసనాలను ప్రదర్శించి అవార్డులు దక్కించుకున్నాడు. విజయ్‌ ఇప్పుడు చైనాలో డ్యాన్సర్‌గా ఒక రోల్‌మోడల్‌గా నిలిచాడు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు