పునాదిపై పోయిన ప్రాణం

23 Oct, 2022 09:17 IST|Sakshi

ధర్మవరం అర్బన్‌: నూతన ఇంటి పునాదికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ధర్మవరంలో చోటు చేసుకుంది. వన్‌ టౌన్‌ ఎస్‌ఐ మహమ్మద్‌ రఫి తెలిపిన వివరాల మేరకు... ప్రియాంకనగర్‌కు చెందిన రషీద్‌(30) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితమే హర్షియాతో వివాహం కాగా, అప్పటి నుంచి ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ కింద ఇంటి వద్ద నుంచే ఉద్యోగం చేస్తున్నాడు.

ఇటీవలే రషీద్‌ కుటుంబం శ్రీలక్ష్మీచెన్నకేశవపురంలో నూతన ఇంటి నిర్మాణం చేపట్టింది. శనివారం పునాదికి నీరు పెట్టేందుకు వెళ్లిన రషీద్, కరెంటు మోటర్‌ త్రీపిన్‌ ప్లగ్‌ పిన్‌ నీటితో తడిసిపోయి ఉండటాన్ని గమనించిన స్విచ్‌ ఆఫ్‌ చేయడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలో విద్యుత్‌ షాక్‌ కొట్టడంతో అక్కడే పడిపోయాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా,   పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఎస్‌ఐ మహమ్మద్‌ రఫి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.  

(చదవండి: ‘ఫ్యామిలీ డాక్టర్‌’తో మెరుగైన వైద్య సేవలు)

మరిన్ని వార్తలు