సినిమా స్టైల్లో అదిరిపోయే ట్విస్ట్‌: నిన్న షాక్‌.. నేడు ప్రేమపెళ్లి

28 Aug, 2021 17:16 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పెళ్లికి కొన్ని గంటల ముందే నిన్న తల్లిదండ్రులు, బంధువులకు షాక్‌ ఇచ్చిన యువతి భార్గవి.. నేడు సింహాచలంలో ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. తనకు తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని భార్గవి శుక్రవారం పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలియదని చెప్పిన భార్గవి.. నేడు తల్లిదండ్రులు నా ప్రేమను అంగీకరించకపోవడంతోనే ప్రేమ పెళ్లి చేసుకున్నానని చెప్పింది.

ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేకే పెళ్లి చేసుకున్నానని తెలిపింది. మేజర్‌ కావడంతో పోలీసులు.. యువతికే నిర్ణయాన్ని వదిలేశారు. తన తల్లిదండ్రులు ఏమనుకున్నా పర్వాలేదని.. తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని భార్గవి చెప్పుకొచ్చింది.

ఇవీ చదవండి:
పాలగుమ్మిలో అరుదైన నీటికుక్కల సందడి 
అధికారులపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు నోటి దురుసు

మరిన్ని వార్తలు