ప్రకాశం బ్యారేజీలో దూకిన యువతి

10 Oct, 2020 11:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ యువతి కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రవాహ వేగానికి కొట్టుకుపోయింది. యువతిని రక్షించేందకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తీవ్రంగా ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. దాదాపు గంట నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. లభించిన టికెట్‌ ఆధారంగా ఆ యువతి ఆటో నగర్‌ నుంచి సిటీ బస్సులో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే యువతికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు