తెలంగాణను నిలువరించండి

23 Jul, 2021 04:28 IST|Sakshi

ఆ రాష్ట్ర అక్రమ నీటి వినియోగాన్ని ఆపండి

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను కూడా..

శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపేలా కూడా చర్యలు తీసుకోండి

లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అక్రమ నిర్మాణంతోపాటు శ్రీశైలంలో అసందర్భోచితంగా, అక్రమంగా నీటిని తెలంగాణ వినియోగిస్తున్నందున ఆంధ్రప్రదేశ్, చెన్నై ప్రాంతాలకు తీవ్ర నీటి సమస్య ఏర్పడుతుందని, ఈ పరిస్థితిని నిలువరించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. ఈ వాదనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ బదులి చ్చారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఈ అంశానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధిం చారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాయలసీమ నాలుగు జిల్లాలతోపాటు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, చెన్నై నగరానికి నీటి విడుదల నిమిత్తం శ్రీశైలం డ్యామ్‌లో కనీస నీటి మట్టాన్ని 854 అడుగులుగా నిర్దేశిస్తూ 2004 సెప్టెంబర్‌ 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 107 జీఓ జారీచేసింది.

ఈ స్థాయిలో నీరు ఉంటేనే ఆయా ప్రాంతాలకు నీటి విడుదల చేసేందుకు సాధ్యమవుతుందని ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయించిం ది. కానీ, తెలంగాణ జెన్‌కో మాత్రం నీటిమట్టం 800 అడుగుల వద్ద ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేపడుతోంది. ఇలా తెలంగాణ విద్యుదుత్పత్తి చేపట్టకుండా నిలువరించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)కి లేఖ రాశారు. విద్యుదుత్పత్తి ఆపాలని కేఆర్‌ఎంబీ ఇప్పటికే తెలంగాణ జెన్‌కో కు జారీచేసిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం, కేఆర్‌ఎంబీలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తాయా? అని ప్రశ్నించారు. 

సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా : మంత్రి
దీనికి కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమాధానమిస్తూ.. ‘రాయలసీమ రైతులకు సంబంధించి సభ్యుడు లేవనెత్తిన అంశంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా.   ఏపీ సీఎం రాసిన లేఖ నాకు అందింది. ఆయన కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు కూడా లేఖ రాశారు.  నేరుగా తెలంగాణ జెన్‌కోకు లేఖ రాస్తూ విద్యుదుత్పత్తిని తక్షణం నిలిపివేయాలని అడిగాం. కానీ, తాము విద్యుదుత్పత్తి నిలిపివేయబోమని, మూడు ప్లాంట్లను పూర్తిస్థాయిలో ఆపరేట్‌ చేయాలనుకుంటున్నామని తెలంగాణ చెప్పింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి లేఖ రాసి విద్యుదుత్పత్తి నిలిపి వేసి ఉండాల్సిందని చెప్పాం..’ అని మంత్రి వివరించారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై..
అనంతరం.. వైఎస్‌ అవినాష్‌రెడ్డి మరో అనుబంధ ప్రశ్న వేశారు. తెలంగాణ సర్కారు పాలమూరు–రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్నీ నిర్మిస్తోంది. ఇది పూర్తయితే  ఎస్‌ఆర్‌బీసీ, తెలుగు గంగ ప్రాజెక్టు, కేసీ కెనాల్, జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, వెలిగొండ ప్రాజెక్టుల ఆయ కట్టుపై, ఏపీ, చెన్నై ప్రాంతాల తాగు నీటి అవస రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.  కాబట్టి పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?’ అని అవినాష్‌ ప్రశ్నించారు.  మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ బదులిస్తూ.. ‘రెండు రాష్ట్రాల ప్రయోజ నాలను కాపాడేందుకు ఏపీ పునర్వ్య వస్థీకరణ చట్టాన్ని అనుసరించి కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ వ్యవస్థలను ఏర్పాటు చేశామని తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు