షిప్ ‌యార్డు ప్రమాదంపై సీఎం జగన్‌ ఆరా

1 Aug, 2020 14:58 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : హిందుస్తాన్‌ షిప్ ‌యార్డులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ప్రమాద ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్‌, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశాలు జారీచేశారు. ప్రమాదానికి గల కారణాలపై యాజమాన్యంతో చర్చించి వివరాలను సేకరించాలని సూచించారు. మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ నుంచి విశాఖకు బయలుదేరారు. కాగా క్రేన్‌ ద్వారా లోడింగ్‌ పనులు పరిశీలిస్తుండగా క్రేన్‌ కుప్ప​కూలిపోవడంతో 10 మంది కార్మికులు మృతి చెందారు. కార్మికుల మృతిపై సీఎం జగన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.(క్రేన్‌ కూలి 11 మంది కార్మికులు మృతి)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు