Jagananna Vidya Deevena: 11న బాపట్లకు సీఎం వైఎస్‌ జగన్‌

6 Aug, 2022 18:40 IST|Sakshi

విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

స్థల పరిశీలన చేసిన తలశిల, మంత్రి మేరుగ, డెప్యూటీ స్పీకర్‌ కోన, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి

సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి మేరుగ పిలుపు 

సాక్షి, బాపట్ల: ఈనెల 11న విద్యాదీవెన పథకం ద్వారా సాయం జమ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం టూర్‌ ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మంత్రి మేరుగ నాగార్జున, డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, కలెక్టర్‌ విజయకృష్ణన్, ఎస్పీ వకుల్‌జిందాల్‌ శుక్రవారం స్థల పరిశీలన చేశారు. బాపట్లలోని ఇంజినీరింగ్‌ కళాశాల, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల ప్రాంగణాల్లో సభావేదిక ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. వ్యవసాయ కళాశాలలో హెలిప్యాడ్‌ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో  అధికారులతో సమీక్షించారు.  


విజయవంతం చేయండి : మంత్రి మేరుగ నాగార్జున  

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను జయప్రదం  చేయాలని మంత్రి మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. విద్యాదీవెన పథకం చాలా గొప్పదని, రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయించిన తేదీకే సంక్షేమ పథకాలను అమలు చేయటం సీఎం జగన్‌కే సాధ్యమైందన్నారు.


కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, అడిషనల్‌ ఎస్పీ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్, జేసీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్‌: తమ్మినేని కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు