సీఎం జగన్‌కు అక్క చెల్లెమ్మలపై అభిమానం

27 Sep, 2020 18:30 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా అక్క చెల్లెమ్మలపై ఆయనకు ఉన్న అభిమానం చాటుకున్నారన్నారు. రేపు వైఎస్సార్‌ జలకళ పథకం ప్రారంభం కానుందని తెలిపారు. మెట్ట ప్రాంత రైతులకు వైఎస్సార్‌ జలకళ పథకం ఒక వరంగా పేర్కొన్నారు. త్వరలోనే ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి అనుసంధానంగా.. రూ.6వేల కోట్లతో గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ప్రతీ మండలంలో కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు. ( సీఎం జగన్‌కు దళితులంటే గౌరవం)

చంద్రబాబుది కుట్రపూరిత వైఖరి: ఎమ్మెల్యే సుధాకర్‌బాబు
‘‘చంద్రబాబుది కుట్రపూరిత వైఖరి. బడుగుబలహీన వర్గాలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే రౌండ్‌ టేబుల్ సమావేశం జరిగింది. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్నది చంద్రబాబు కాదా? అప్పుడెందుకు హర్షకుమార్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశం పెట్టలేదు?’’

మరిన్ని వార్తలు