ఆలయాల పునర్నిర్మాణానికి రేపు సీఎం జగన్‌ శంకుస్థాపన

7 Jan, 2021 19:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి రేపు(శుక్రవారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. రేపు ఉదయం 11:01 నిమిషాలకు ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. (చదవండి: మధ్యతరగతి ప్రజలకు ఏపీ​ ప్రభుత్వం కొత్త పథకం

విజయవాడలో పునర్నిర్మాణం చేపట్టే ఆలయాలు..
రూ.70 లక్షలతో రాహు-కేతు ఆలయ పునర్నిర్మాణం
రూ.9.5 లక్షలతో సీతమ్మ పాదాలు ఆలయ పునర్నిర్మాణం
రూ.31.5 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం
రూ.2 కోట్లతో రాతితో శ్రీ శనీశ్వర ఆలయ పునర్నిర్మాణం
రూ.8 లక్షలతో బొడ్డుబొమ్మ ఆలయ పునర్నిర్మాణం
రూ.20 లక్షలతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం(దుర్గగుడి మెట్ల వద్ద)
రూ.10 లక్షలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయ పునర్నిర్మాణం
రూ.10 లక్షలతో వీరబాబు ఆలయం పునర్నిర్మాణం (పోలీస్‌ కంట్రోల్‌ రూం సమీపంలో)
రూ.20 లక్షలతో కనకదుర్గ నగర్‌లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల పునర్నిర్మాణం

విజయవాడ దుర్గగుడి అభివృద్ధి విస్తరణ పనులు..
రూ.8.5 కోట్లతో ప్రసాదంపోటు భవన పునర్నిర్మాణం
రూ.5.6 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం
రూ.2 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాకారం విస్తరణ
రూ.23.6 కోట్లతో కేశఖండనశాల భవన నిర్మాణం
రూ.19.75 కోట్లతో అన్నప్రసాదం భవన నిర్మాణం
రూ.5.25 కోట్లతో కనకదుర్గ టోల్‌ప్లాజా నిర్మాణం
రూ.6.5 కోట్ల నిధులతో ఘాట్‌ రోడ్‌లో మరమ్మతులు
కొండచరియలు విరిగి పడకుండా మరమ్మతులు, పటిష్ట చర్యలు
రూ.2.75 కోట్లతో ఆలయం మొత్తం ఎనర్జీ, వాటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పనులు

మరిన్ని వార్తలు